Homeటాప్ స్టోరీస్హరీష్ రావు తిరుగుబాటు ఖాయమేనా ?

హరీష్ రావు తిరుగుబాటు ఖాయమేనా ?

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికైనా హరీష్ రావు రూపంలో తిరుగుబాటు చేయడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుడి కూతురు రమ్యా రావు . కేసీఆర్ పై నిప్పులు చెరిగే రమ్యా రావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది ఇన్నాళ్లు అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది . కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో మీడియా తో మాట్లాడిన రమ్యా రావు హరీష్ రావు రూపంలో టీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు రానుందని సంచలన వ్యాఖ్యలు చేసింది .

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితిలో మొదటినుండి హరీష్ రావు కస్టపడి పనిచేశాడని . అలాగే అతను ఉన్నత పదవిలో ఉండాలని సిద్ధిపేట ప్రజలు మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కానీ హరీష్ రావు ని కావాలనే పక్కన పెడుతూ అవమానిస్తున్నారని దాంతో తప్పకుండా తిరుగుబాటు రావడం ఖాయమని అంటోంది . రమ్యా రావు వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ హరీష్ రావు ని మాత్రం కావాలనే పక్కన పెడుతున్నట్లు స్పష్టం అవుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All