Homeటాప్ స్టోరీస్రాజమౌళి పై రామోజీరావు ఆగ్రహంగా ఉన్నాడట

రాజమౌళి పై రామోజీరావు ఆగ్రహంగా ఉన్నాడట

ramoji rao fire on ss rajamouliదర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పై మీడియా మొఘల్ రామోజీరావు చాలా ఆగ్రహంగా ఉన్నాడట ! ఈ ఇద్దరికీ బాహుబలి వల్ల చెడిందని టాక్ . అప్పట్లో రాజమౌళి కి రామోజీరావు బాగానే సహకరించాడు . బాహుబలి 1, బాహుబలి 2 కోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్స్ వేసిన సంగతి తెలిసిందే . ఆ సినిమాల కోసం ఏకంగా అయిదేళ్ల పాటు సహకారం అందించాడు రామోజీరావు అయితే ఆ సినిమా శాటిలైట్ విషయంలో రేటు దగ్గర తేడా రావడంతో ఈటీవీ కి ఆ హక్కులు ఇవ్వకుండా మా టివి కి ఇచ్చాడు జక్కన్న అండ్ కో .

దాంతో కోపం నషాళానికి ఎక్కిన రామోజీ తన ఫిలిం సిటీ ని వాడుకున్నందుకు ఏకంగా 90 కోట్ల బిల్లులు పంపాడట ! ఆ బిల్లులు చూసి జక్కన్న అండ్ కో కు ఇంకా బాగా మండింది . దాంతో ఎడమొహం – పెడమొహం గా ఉంటున్నారు రామోజీ అండ్ జక్కన్న . తాజాగా ఎన్టీఆర్చరణ్ ల సినిమా కోసం అల్యుమియం ఫ్యాక్టరీ లో భారీ సెట్ వేస్తుండటంతో మరోసారి ఈ విబేధాలు రచ్చకెక్కాయి . నన్ను కాదని మరో చోట పెట్టుకున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట మీడియా దిగ్గజం . రామోజీ తో చెడింది కాబట్టే అల్యూమియం ఫ్యాక్టరీ వైపు వెళ్ళాడు జక్కన్న అయితే బాహుబలి నిర్మాతలతో కూడా రాజమౌళి కి అంతగా సఖ్యత లేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All