Homeటాప్ స్టోరీస్నదియాని అవమానించిన దర్శకుడు

నదియాని అవమానించిన దర్శకుడు

Ramkyakrishna replaced with Nadiya in tamil movieసీనియర్ నటి నదియా ని ఓ దర్శకుడు అవమానించడంతో ఆ సినిమా చేయనని చెప్పేసి బయటకు వచ్చేసింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన తమిళనాట జరిగింది . 90 వ దశకంలో హీరోయిన్ గా తెలుగు , తమిళనాట సత్తా చాటిన భామ నదియా , కట్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది ఇప్పుడు . టాలీవుడ్ లో మిర్చి ,అత్తారింటికి దారేది తదితర చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది . అయితే అంతటి నటి కి అవమానం జరగడం ఇక్కడ సంచలనం అయ్యింది . ఇంతకీ అసలు విషయం ఏమిటంటే …… ఓ తమిళ సినిమాలో దర్శకుడు మిస్కిన్ తో పాటుగా నదియా కూడా నటిస్తోంది .

షూటింగ్ లో భాగంగా మిస్కిన్ ని నదియా కొట్టాలి , అయితే అలా కొట్టే సీన్ తీస్తున్నప్పుడు సరిగా కొట్టలేక పోయింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 సార్లు మిస్కిన్ ని చెంప మీద కొట్టింది నదియా , అయితే దర్శకుడు అనుకున్న స్థాయిలో ఆ సీన్ రాకపోవడంతో మిస్కిన్ కు కోపం వచ్చి నదియా ని తిట్టాడట ! దాంతో అవమానంగా భావించిన నదియా మీ సినిమాలో నటించడం నా వల్ల కాదు అంటూ తప్పుకుందట . నదియా స్థానంలో రమ్యకృష్ణ ని ఆ పాత్రలో తీసుకోగా కేవలం రెండే షాట్ లలో మిస్కిన్ చెంప పగులగొట్టి భేష్ అనిపించిందట నీలాంబరి .

- Advertisement -

English Title: Ramkyakrishna replaced with Nadiya in tamil movie

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All