Homeఎక్స్ క్లూసివ్వివాదాస్పద ట్రైలర్ వచ్చేది రేపే

వివాదాస్పద ట్రైలర్ వచ్చేది రేపే

Ramgopal varma tweet about lakshmi's ntr trailer వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ బయోపిక్ ని టార్గెట్ చేసిన వర్మ ఇప్పటికే ఆ సినిమాపై బోలెడు విమర్శలు చేసాడు . ఇక ఇప్పుడేమో ఏకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు . రేపు ఉదయం లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నాడు .

 

- Advertisement -

అలాగే ఈ ట్రైలర్ ని ఎన్టీఆర్ మహానాయకుడు తో పాటుగా ప్రదర్శించేలా థియేటర్ వాళ్లతో కూడా ఒప్పందం చేసుకుంటున్నాడు . ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఈనెల 22 న విడుదల అవుతున్న నేపథ్యంలో దానికి పోటీ గా వివాదాస్పద ట్రైలర్ ని ప్రదర్శించనున్నారు .ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన నేపథ్యాన్ని ఎంచుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే . ట్రైలర్ రిలీజ్ అయ్యాక అలాగే సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి వివాదాలను రాజేస్తుందో చూడాలి .

 

English Title: Ramgopal varma tweet about lakshmi’s ntr trailer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All