Homeటాప్ స్టోరీస్హీరోగా మారిన రాంగోపాల్ వర్మ

హీరోగా మారిన రాంగోపాల్ వర్మ

rgv-cobraదర్శకుడిగా , నిర్మాతగా రాణించిన వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా ” కోబ్రా ” అనే సినిమాతో హీరోగా మారుతున్నాడు . ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా వర్మ నటిస్తున్న కోబ్రా చిత్ర విశేషాలని నిన్న రాత్రి వెల్లడించారు ఆ చిత్ర బృందం . ఈరోజు రాంగోపాల్ వర్మ పుట్టినరోజు దాంతో ఈ విశేషాన్ని తెలిపారు . తన సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ వచ్చిన వర్మ కు యాక్టింగ్ మీద గాలి మళ్లినట్లుంది అందుకే హీరోగా మారాడు . 
 
అయితే కోబ్రా పోస్టర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా ఉన్నట్లుగా ప్రకటించారు అంటే బహుశా ఇది నయీమ్ గ్యాంగ్ మీద తీసిన సినిమా అయి ఉండాలి . నయీమ్ ని పోలీసులు పెంచి పోషించిన విషయం తెలిసిందే . నక్సలైట్ల ని అంతం చేయడానికి నయీమ్ ని వాడుకున్నారు కట్ చేస్తే పోలీసులనే సవాల్ చేసే స్థాయికి ఎదిగాడు . అంతేకాదు నయీమ్ తో పాటుగా నయీమ్ గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు . వాటిని చూపించే ప్రయత్నం వర్మ చేస్తున్నట్లు తెలుస్తోంది . 
 
ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ తో మంచి విజయం సాధించాడు వర్మ . ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు కోబ్రా తీస్తున్నాడు . కాకపోతే ఇందులో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా వర్మ నటిస్తున్నాడు . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All