
కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ తో వివాదాన్ని రాజేసిన దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా మరోసారి ఆ వివాదాన్ని పెద్దది చేయబోతున్నాడు. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ ఓ వివాదస్పద వీడేమో విడుదల చేసిన వర్మ తాజాగా ఈ కింది నాయకుల డూప్ లు కావాలంటూ ప్రకటన జారీ చేసాడు.
టైటిల్ చూడగానే ఇట్టే అర్థమైపోతుంది కాబట్టి పక్కగా ఇది రాజకీయ వ్యంగ్య చిత్రమే!
ఇక ఎవరెవరి పాత్రలు ఉన్నాయి వాళ్ళ డూప్ లు ఎవరెవరు కావాలో ఓ లిస్ట్ విడుదల చేసాడు వర్మ. ఆ లిస్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, నారా బ్రాహ్మణి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, స్పీకర్ తమ్మినేని సీతారాం, నారా లోకేష్,
అచ్చయ్య నాయుడు, నారా దేవాన్ష్, దేవినేని ఉమా మహేశ్వర్ రావు, కేశినేని నాని, కోడెల శివప్రసాద్ రావు, ఘంటా శ్రీనివాసరావు, సుజనా చౌదరి, పోలీసు అధికారి గౌతమ్ సవాంగ్ లతో పాటుగా ప్రధాని మోడీ, అమిత్ షా ల డూప్ ల కోసం
వెతుకుతున్నాడట.
వీళ్ళు దొరికితే షూటింగ్ స్టార్ట్ చేస్తాడట. వీళ్ళే కాదు తన కథలో అవసరమైన వాళ్ళ కోసం వర్మ సెర్చింగ్ లో ఉన్నాడట. కమ్మరాజ్యంలో కడప రెడ్లు విడుదల అయితే ఎంత సంచలనం సృష్టిస్తుందో!