
ఏయ్ ! జగన్ గా ఇట్టాంటి బ్లాక్ బస్టర్ లు తీసే దమ్ముండి కూడా ఎందుకు తీయవ్ రా బాడ్ కావ్ ? అంటూ శిష్యుడు పూరి జగన్నాధ్ ని బూతులు తిట్టేసారు దర్శకులు రాంగోపాల్ వర్మ . ఇదంతా నిజంగా కోపంగా తిట్టింది కాదు సుమా ! ప్రేమతో అన్నమాట . పూరి జగన్నాధ్ రాంగోపాల్ వర్మ శిష్యుడు అన్న విషయం తెలిసిందే . ఇక తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో దానికి మరింతగా ప్రచారం కల్పించే ప్రయత్నంలో ఇలా వ్యవహరిస్తున్నాడు వర్మ .
నిన్న సాయంత్రం ఇలా ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు . అంతేనా …… నిన్న మధ్యాహ్నం ట్రిపుల్ రైడింగ్ చేస్తూ మూసాపేట థియేటర్ లో సినిమా చూసాడు వర్మ . ఇది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీనే ! వర్మ అంటేనే ఫ్రీ పబ్లిసిటీ ఎలా వస్తుందో బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఇలా దూసుకుపోతున్నాడు .
Aey jagan gaa,ittanti blockbusterlu theese dhammundi kooda yendhuku thiyyavraa bhaadkav? @purijagan @Charmmeofficial @ramsayz @NabhaNatesh @AgerwalNidhhi pic.twitter.com/liUidLtwqs
— Ram Gopal Varma (@RGVzoomin) July 20, 2019