Homeటాప్ స్టోరీస్చరణ్ మాటని దర్శక నిర్మాతలు వింటారా

చరణ్ మాటని దర్శక నిర్మాతలు వింటారా

ramcharan open talks on collectionsసినిమా కలెక్షన్ల విషయంలో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ . ఇక నుండి తన సినిమాల కలెక్షన్ల వివరాలు పోస్టర్ లపై కానీ అలాగే యాడ్స్ లలో కానీ ప్రస్తావన తీసుకురాకుండా చూడాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు చరణ్ . ఎందుకంటే ఆ కారణం కూడా చెబుతున్నాడు చరణ్ . ” ఎన్టీఆర్ , మహేష్ బాబు ” లతో పాటుగా మిగతా హీరోలు అందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అంతేకాదు నేనంటే కూడా వాళ్లకు చాలా అభిమానం అలాంటిది ఈ కలెక్షన్ల వల్ల మా హీరోల మధ్య సఖ్యత లేదని అనుకుంటారు అభిమానులు .

మేమంతా కలిసే ఉంటున్నాం , ఒకరి సినిమా విడుదల అవుతుందంటే హిట్ కావాలని కోరుకుంటున్నాం కూడా కానీ మా అభిమానులు మాత్రం ఇతర హీరోలని ద్వేఇషిస్తున్నారు అలాగే అభిమానులు పరస్పరం దాడి చేసుకుంటున్నారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నా దర్శక నిర్మాతలకు ఈ విషయం గట్టిగా చెబుతాను అని అంటున్నాడు చరణ్ . మెగా హీరో చరణ్ చెబుతున్న మాటలు చాలా బాగున్నాయి కానీ దర్శక నిర్మాతలు చరణ్ మాట వింటారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అంటూ యాడ్స్ ఇస్తుంటారు , ప్రకటనలు జారీ చేస్తుంటారు మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All