Homeటాప్ స్టోరీస్రామారావు ఆన్ డ్యూటీ టీజర్ టాక్ - ‘వాడో సూపర్ మేన్’

రామారావు ఆన్ డ్యూటీ టీజర్ టాక్ – ‘వాడో సూపర్ మేన్’

Ramarao On Duty Teaser out now
Ramarao On Duty Teaser out now

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో ఉన్నాడు. గత ఏడాది క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలను లైన్లో పెట్టాడు. రీసెంట్ గా ఖిలాడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ప్రేక్షకుల అంచనాలు అందుకోలేపోయాడు. అయినప్పటికీ ఏమాత్రం జోష్ తగ్గించుకోకుండా తదుపరి సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వాటిలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఈరోజు మహాశివరాత్రి సందర్బంగా సరికొత్త టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో రవితేజ నటించారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో టీజర్ మొదలైంది… పేరు సింపుల్ గా వున్నా వాడు సూపర్ మ్యాన్ అంటూ జాన్ విజయ్ చెబుతున్న డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -

‘ఆయుధం మీద ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది’ అంటూ విలన్ తో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అయితే విలన్ పాత్రధారి ఎవరన్నది రివీల్ చేయలేదు. పోలీస్ డ్రెస్ లో ఉన్న తొట్టెంపూడి వేణు .. ‘అవును పితలాటకం మనిషే’ అనడంతో టీజర్ ను ఎండ్ చేశారు. టోటల్ గా చెప్పాలంటే.. ఎంతో ఇంటెన్స్ తో కూడిన సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించిన టీజర్ లో రవితేజ చాలా ఇంటెన్స్ గా పవర్ ఫుల్ లుక్ లో కనిపించి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇద్దరు హీరోయిన్ లు కూడా టీజర్ లో చాలా హోమ్లీగా కనిపించారు.

రఇక ఈ చిత్రానికిసామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా మార్చ్ 25 లేదా ఏప్రిల్ 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All