
మాస్ మహా రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో ఉన్నాడు. గత ఏడాది క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలను లైన్లో పెట్టాడు. రీసెంట్ గా ఖిలాడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ప్రేక్షకుల అంచనాలు అందుకోలేపోయాడు. అయినప్పటికీ ఏమాత్రం జోష్ తగ్గించుకోకుండా తదుపరి సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
వాటిలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఈరోజు బుధువారం సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. జూన్ 17 న సినిమా ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. రవితేజ, రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ మూవీ తో తొట్టెంపూడి వేణు రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.