Homeటాప్ స్టోరీస్మహానటి పై సంచలన కామెంట్ చేసిన రమాప్రభ

మహానటి పై సంచలన కామెంట్ చేసిన రమాప్రభ

ramaprabha controversial comments on mahanati savitriమహానటి సావిత్రి పై సంచలన వ్యాఖ్యలు చేసి మరో వివాదాన్ని రాజేసింది సీనియర్ నటి రమాప్రభ . అసలు సావిత్రి జీవితం నాశనం కావడానికి జెమిని గణేశన్ , అని లేదంటే మరొకరు కారణం అని అంటున్నారు కానీ అసలు కారణం ఆమె ! సావిత్రి స్వయం కృతాపరాధం వల్లే నాశనం అయ్యిందని అంతేకాదు తాగుడు అలవాటు చేసింది జెమిని గణేశన్ కాదని సావిత్రి కి అంతకు ముందే ఆ అలవాటు ఉందని వివాదాస్ప వ్యాఖ్యలు చేసింది .

అయితే సావిత్రి ఎంత మంచి మనసున్న మహా మనిషో అంతకంటే మహా మొండిదని అందువల్లే అన్ని కష్టాలు పడిందని మొత్తంగా ఆమె చేసిన తప్పులే ఆమెని బలి తీసుకున్నాయని వ్యాఖ్యానించింది రమాప్రభ . సావిత్రి ఉన్నతి ని అలాగే జీవిత చరమాంకంలో అనుభవించిన బాధలను అన్నింటిని దగ్గర నుండి చూసిన వ్యక్తి రమాప్రభ . అలాగే సావిత్రి చివరి రోజుల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా రమప్రభే కావడం గమనార్హం . ఒకవైపు సావిత్రి ని పొగుడుతూనే మరోవైపు ఆమె జీవితం అర్దాంతరంగా ముగియడానికి ఆమె కారణం అని అంటోంది రమాప్రభ . మహానటి బయోపిక్ సంచలన విజయం సాధిస్తూ అందరి చేత జేజేలు పలుకుతున్న ఈ సమయంలో సావిత్రి వ్యక్తిగత జీవితం మళ్ళీ చర్చ కు వస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All