Homeటాప్ స్టోరీస్శివరాత్రికి 'మాస్ తూఫాన్ ' రాబోతుంది

శివరాత్రికి ‘మాస్ తూఫాన్ ‘ రాబోతుంది

Rama Rao On Duty Teaser will be out on March 1st

మాస్ మహారాజ్ రవితేజ జెట్ స్పీడ్ లో ఉన్నాడు. గత ఏడాది క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలను లైన్లో పెట్టాడు. రీసెంట్ గా ఖిలాడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ఈ సినిమా బాగా డిస్పాయింట్ చేసింది. అయినప్పటికీ ఏమాత్రం జోష్ తగ్గించుకోకుండా తదుపరి సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వాటిలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుంది. మహా శివరాత్రి కానుకగా మార్చి 1న టీజర్ రాబోతోందని మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్ లో ఫార్మల్ డ్రెస్ లో టక్ చేసుకుని అగ్రెసివ్ గా రవితేజ కనిపించగా.. ఓ రౌడీ చేయి విరుస్తూ అతని గుండెల మీద కాలు పెట్టి ఉండటాన్ని పోస్టర్ లో చూపించారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. రజీష విజయన్ మరో హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా మార్చ్ 25 లేదా ఏప్రిల్ 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All