Homeటాప్ స్టోరీస్రామ్ రెడ్ ప్రమోషన్స్ ను మొదలుపెడుతున్నాడా?

రామ్ రెడ్ ప్రమోషన్స్ ను మొదలుపెడుతున్నాడా?

రామ్ రెడ్ ప్రమోషన్స్ ను మొదలుపెడుతున్నాడా?
రామ్ రెడ్ ప్రమోషన్స్ ను మొదలుపెడుతున్నాడా?

వరస ప్లాపులతో ఉక్కిరిబిక్కిరి అయిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ గతేడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తర్వాత రామ్ మళ్ళీ పూర్తి కాన్ఫిడెన్స్ తో కనిపించాడు.

ఇస్మార్ట్ విజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రామ్, తనతో రెండు సినిమాలకు పనిచేసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో తమిళంలో సూపర్ డూపర్ హిట్ గా తడం చిత్రాన్ని రెడ్ పేరుతో రీమేక్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందే పూర్తయింది. అలాగే ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ సినిమా విడుదల అర్ధాంతరంగా ఆగిపోయింది.

- Advertisement -

అయితే ఓటిటి సంస్థల నుండి రెడ్ సినిమాను విడుదల చేయమని ఆఫర్లు అయితే బానే వచ్చాయి కానీ రామ్ మాత్రం వాటికి ససేమీరా అన్నాడు. రెడ్ థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించాడు. ఇక ఇప్పుడు థియేటర్లు తెరుచుకోనున్న విషయం తెల్సిందే.

అక్టోబర్ 15 నుండి థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు రామ్ అండ్ కో అక్టోబర్ చివరి వారంలో కానీ నవంబర్ మొదటి వారంలో కానీ రెడ్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం రెడ్ ప్రమోషన్స్ ను పూర్తి స్థాయిలో చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే అవి మొదలుకానున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All