Homeన్యూస్స్టార్ డైరెక్టర్ పరశురామ్ గారి చేతుల మీదుగా రామ్ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్‌ రిలీజ్...

స్టార్ డైరెక్టర్ పరశురామ్ గారి చేతుల మీదుగా రామ్ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్‌ రిలీజ్ చేయడం జరిగింది.

స్టార్ డైరెక్టర్ పరశురామ్ గారి చేతుల మీదుగా రామ్ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్‌ రిలీజ్ చేయడం జరిగింది.
స్టార్ డైరెక్టర్ పరశురామ్ గారి చేతుల మీదుగా రామ్ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్‌ రిలీజ్ చేయడం జరిగింది.

నిజ జీవిత కథలను తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్యకాలంలో దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఇలాంటి స్టోరీలపైనే మక్కువ పెరుగుతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ పొంది విజయం సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదే బాటలో వెళుతూ దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా రామ్‌ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా రూపొందిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

స్టార్ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లో దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ హీరో చెప్పిన డైలాగ్ హైలైట్ అవుతోంది. హీరో డైలాగ్ డెలివరీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. ఈ సీన్ షూట్ చేసిన లొకేషన్ హీరో పవర్ ఫుల్ డైలాగ్‌కి యాప్ట్ అయ్యేలా ఉంది. మొత్తంగా చూస్తే ఈ గ్లింప్స్ సినిమా స్థాయిని కళ్ల ముందు కదలాడించిందని చెప్పుకోవచ్చు. ఇక రామ్ (RAM- రాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌) టైటిల్ మధ్యలో కనిపిస్తున్న అశోక చక్రం ఈ మూవీ రేంజ్ ఏంటో చెబుతోంది. ఈ టైటిల్ లుక్ తోనే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.

- Advertisement -

దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కాబోతున్నారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు.

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ
నిర్మాత: దీపికాంజలి వడ్లమాని
బ్యానర్స్: దీపికా ఎంటర్‌టైన్‌మెంట్ & ఓ ఎస్‌ యం విజన్‌
సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్
సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రే డిఎసి

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All