Homeటాప్ స్టోరీస్దిశ ఎన్‌కౌంట‌ర్ ట్రైల‌ర్‌ వ‌చ్చేసింది!

దిశ ఎన్‌కౌంట‌ర్ ట్రైల‌ర్‌ వ‌చ్చేసింది!

దిశ ఎన్‌కౌంట‌ర్ ట్రైల‌ర్‌ వ‌చ్చేసింది!
దిశ ఎన్‌కౌంట‌ర్ ట్రైల‌ర్‌ వ‌చ్చేసింది!

వివాదానికి కేరాఫ్ అడ్ర‌స్ రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. ఆయ‌న ఎక్క‌డ వివాదం వుంటే అక్క‌డే తిష్ట‌వేసుకుని కూర్చుంటార‌న్న‌ది అందిరికి తెలిసిందే. వివాదాన్నే త‌న సినిమాకు క‌థా వ‌స్తువుగా చేసుకుంటూ ద‌ర్శ‌కుడిగా త‌న ఉనికిని చాటుకుంటున్నారు. ఇటీవ‌ల వ‌రుస బీగ్రేడ్‌ చిత్రాల‌ని అందించి సంచ‌ల‌నం సృష్టించిన వ‌ర్మ మ‌రోసారి వివాదాస్ప‌ద అంశాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

ఇటీవ‌ల శంషాబాద్ స‌మీపంలో జ‌రిగిన దిశా దారుణ అత్యాచారం, హ‌త్య దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇదే అంశాన్ని తీసుకుని వ‌ర్మ `దిశా ఎన్‌కౌంట‌ర్‌` పేరుతో  సినిమా చేస్తున్నారు. ఈ విష‌యాన్ని గ‌త కొన్ని నెల‌ల ముందే ప్ర‌క‌టించిన ఆశ్చ‌ర్య‌పరిచిన వ‌ర్మ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ట్రైల‌ర్‌‌ని శ‌నివారం ఉద‌యం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు.

- Advertisement -

ఈ ట్రైల‌ర్‌‌లో దిశ టోల్ బూత్ స‌మీపంలో త‌న టూ వీల‌ర్ స్కూట‌ర్‌ని పార్క్ చేయ‌డం.. ఆ విష‌యాన్ని తోడేళ్ల‌లా గ‌మ‌నించిన లారీ సిబ్బంది గాలి తీసేయ‌డం.. పాశ‌వికంగా అత్యాచారం చేసి ఆ త‌రువాత హ‌త్య చేయ‌డం.. కొన ఊపిరితో వుండ‌గానే కాల్చేయ‌డం వంటి స‌న్నివేశాల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు వ‌ర్మ‌. ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రంలో దిశాగా సోనియా ఆకుల న‌టించింది. ఈ హీద‌య విదార‌క‌మైన క‌థ‌కు ఆమె న‌ట‌న ప్రాణం పోసింది. సోనియా ఒక NGO (యాక్షన్ ఎయిడ్ ఫర్ సోషల్ అడ్వాన్స్‌మెంట్) వ్యవస్థాపకురాలు. ఆమెకు వెల్క‌మ్ చెబుతున్నా` అని వ‌ర్మ ట్వీట్ చేశారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All