Homeటాప్ స్టోరీస్వ‌ర్మ‌లో ఇంత మార్పా.. సాయం అంటూ పోస్ట్‌!

వ‌ర్మ‌లో ఇంత మార్పా.. సాయం అంటూ పోస్ట్‌!

వ‌ర్మ‌లో ఇంత మార్పా.. సాయం అంటూ పోస్ట్‌!
వ‌ర్మ‌లో ఇంత మార్పా.. సాయం అంటూ పోస్ట్‌!

రామ్ గోపాల్ వ‌ర్మ‌లో ఇంత మార్పా?. లేక సెన్సేష‌న్ కోస‌మే ఇదంతా చేస్తున్నారా? అంటే సెన్సేష‌న్ కోసమే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ ఇదంతా చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల శంషాబాద్‌లో జ‌రిగిన దిశ సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. మాన‌వ‌త్వం అనే మాట‌కే మ‌చ్చ‌ని తెచ్చింది. న‌లుగురు న‌రరూప రాక్ష‌సులు అమాయ‌కురాలైన దిశ‌ని అత్యంత కిరాత‌కంగా మాన‌భంగం చేపి హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే.

ఈ సంఘ‌ట‌న‌కు బాధ్యులైన వారు ఇటీవల జ‌రిగిన ఎన్ కౌంట‌ర్‌లో మ‌ర‌ణించారు. దీనిపై విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో వ‌ర్మ ఈ సంఘ‌ట‌న‌పై సినిమా తీస్తాన‌ని, చెన్న‌కేశ‌వులు భార్య‌ని క‌లిసి వార్త‌ల్లో నిలిచారు. తాజాగా ఆమె ఓ పాప‌కి జ‌న్మినిచ్చింది. ఆ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా శ‌నివారం పోస్ట్ వ‌ర్మ ఆ ఫొటోల‌తో పాటు యాక్సిస్ బ్యాంక్ కు సంబంధించిన అకౌంట్ నంబ‌ర్‌ని పోస్ట్ చేసి స‌హాయం చేయండ‌ని కోర‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

- Advertisement -

చెన్న‌కేశ‌వులు భార్య రేణుక అమ్మాయికి జ‌న్మ‌నిచ్చింది. ఇద్ద‌రూ క్షేమంగానే వున్నారు. అయితే ఆమె భ‌విష్య‌త్తు మాత్రం అంత ఆషాజ‌న‌కంగా వుండేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఓ రేపిస్టు కూతురిగా పుట్టిన అమ్మాయి భ‌విష్య‌త్తు కోసం అంతా ముందుకు రండి స‌హాయం చేయండి` అంటూ వ‌ర్మ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All