Homeటాప్ స్టోరీస్నాకు ఎవ‌రి అనుమ‌తి అవ‌స‌రం లేదు: వ‌ర్మ‌

నాకు ఎవ‌రి అనుమ‌తి అవ‌స‌రం లేదు: వ‌ర్మ‌

నాకు ఎవ‌రి అనుమ‌తి అవ‌స‌రం లేదు: వ‌ర్మ‌
నాకు ఎవ‌రి అనుమ‌తి అవ‌స‌రం లేదు: వ‌ర్మ‌

ఎక్క‌డ వివాదం వుంటే అక్క‌డ వ‌ర్మ వుంటారు అన్న విష‌యం చాలా సంద‌ర్భాల్లో నిరూనిత‌మైంది. నిత్ం వివాదాల‌నే త‌న సినిమాల‌కు క‌థా వ‌స్తువులుగా చేసుకుంటూ గ‌త కొంత కాలంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. ఇటీవ‌ల `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`, వంగ‌వీటి, అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు` వంటి వివాదాస్ప‌ద చిత్రాల్ని తెర‌కెక్కించి సంచ‌నం సృష్టించిన వ‌ర్మ క‌న్ను దిషా సంఘ‌ట‌న‌పై ప‌డింది. హైద‌రాబాద్ శివారులోని షాద్‌న‌గ‌ర్ స‌మీపంలోని తొండుప‌ల్లి టోల్ ప్లాజా వ‌ద్ద జ‌రిగిన దిషా సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే.

అంశాన్నే త‌న తాజా చిత్రానికి ఎంచుకున్న వ‌ర్మ గ‌త కొన్ని రోజులుగా ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన విష‌యాల్ని లోతుగా ప‌రిశీలించ‌డం మొద‌లుపెట్టారు. న‌లుగురు హంత‌కులు దిషాని అత్యంత కిరాతకంగా మాన భంగం చేసి దారుణంగా కాల్చి చంపిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సంఘ‌ట‌న‌లో పాల్గొన్నవారిలో చెన్న‌కేశ‌వులు ఒక‌డు. అత‌ని భార్య రేణుక‌ని క‌లిసి సంఘ‌ట‌న పూర్వ‌ప‌రాలు తెలుసుకున్న వ‌ర్మ తాజాగా శంషాబాద్ ఏసీపీని సోమ‌వారం క‌లిసి కేసు గురించి వివ‌రాలు తెలుసుకోవ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన వ‌ర్మ‌. దిష‌ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఒక ద‌ర్శ‌కుడిగా ఎమోష‌న‌ల్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాను. ఈ విష‌యంలో ఎవ‌రి అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని, ఎట్టిప‌రిస్థితుల్లోనూ `దిషా` చిత్రాన్ని తీసి తీరుతాన‌ని స్ప‌ష్టం చేయాడం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All