Homeటాప్ స్టోరీస్రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌డుతుంటే నీరో...

రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌డుతుంటే నీరో…

Ram gopal varma enjoying on social media
Ram gopal varma enjoying on social media

రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌డుతుంటే నీరో చ‌క్క‌వ‌ర్తి ఫిడేలు వాయించిన‌ట్టుగా వుంది రామ్‌గోపాల్ వ‌ర్మ తీరు. ఓ ప‌క్క క‌రోనా వైర‌స్ కార‌ణంగా జ‌నాలు బెంబేలుత్తిపోతుంటే రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు మాత్రం చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేదంట‌. సోష‌ల్ మీడియాలో ఫొటోల‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు వ‌ర్మ‌. `దావూద్ గోపాల్ రామ్ ఇబ్ర‌హీమ్ వ‌ర్మ` అనే ట్యాగ్ లైన్‌ల‌తో చుట్టూ టాలీవుడ్ టు బాలీవుడ్ హీరోల మాస్కులు ధ‌రించిన వ్య‌క్తు కొంత మంది నిలుచుని, కూర్చుని వుంటే మ‌ధ్య‌లో కాలుపై కాలు వేసుకుని ద‌ర్జాగా సిగ‌రేట్ వెలిగిస్తూ వ‌ర్మ ఎంజాయ్ చేస్తున్న గిఫ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియో గిఫ్‌లో చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, స‌ల్మాన్‌ఖాన్‌, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, క‌మ‌ల్‌హాస‌న్‌, ఎన్టీఆర్ ల మాస్కులు ధ‌రించిన వ్య‌క్తులున్న‌రు. `దావూద్ గోపాల్ రామ్ ఇబ్ర‌హీమ్ వ‌ర్మ` అనే త‌న‌కు తానే వ‌ర్మ పేరు పెట్టుకోవ‌డం. మ‌ధ్య‌లో ఓ డాన్‌లా కూర్చుని ఫొజులివ్వ‌డం, మరో గిఫ్ వీడియోలో డెవిల్ మాస్క్‌ని ధ‌రించిన వ‌ర్మ భ‌య‌పెడుతున్న లుక్ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

దీనికి కూడా వ‌ర్మ ఓ ట్యాగ్  లైన్ ఇచ్చారు. `డెవిల్ దావూద్ రామ్‌వ‌ర్మ` అంట‌. అయితే ఈ వీడియోల‌ని చూసిన వారంతా వ‌ర్మ‌పై సెటైర్లు వేస్తున్నారు. ప్ర‌పంచం మొత్తం క‌రోనా వైర‌స్ కార‌ణంగా భ‌యంతో వ‌ణికిపోతుంటే వ‌ర్మ మాత్రం ఇలా ఎంజాయ్ చేయ‌డం ఏమీ బాగాలేద‌ని, వ‌ర్మ తీరు చూస్తుంటే `రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌డుతుంటే నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేలు వాయించిన‌ట్టుగా వుంద‌ని సెటైర్లు వేస్తున్నారు. వ‌ర్మ ప‌ట్టించుకుంటారా ఏంటీ?.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All