Homeటాప్ స్టోరీస్కేసీఆర్ బయోపిక్ ను ప్రకటించిన వర్మ

కేసీఆర్ బయోపిక్ ను ప్రకటించిన వర్మ

Ram Gopal Varma announces biopic on KCR
Ram Gopal Varma announces biopic on KCR

వివాదాస్పద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ను త్వరలోనే తీస్తానని ప్రకటించారు. తాజాగా ఈయన నుండి “మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమా రాబోతుంది. అప్సర రాణి, నైనా గంగూలీ లు ప్రధాన పాత్ర పోషించారు. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందింది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టిన వర్మ..మీడియా తో మాట్లాడుతూ..ఏపీ లో టికెట్ల రేట్ల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సినిమాను ఓ.టి.టి, థియేటర్లలో రెండింటిలో విడుదల చేస్తాం అని తెలిపారు. ఇక డేంజరస్ సినిమా 40 రోజుల్లో పూర్తి చేసానని తెలిపిన వర్మ ..తనకు కాశ్మీర్ ఫైల్ సినిమా బాగా నచ్చిందని..త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ సినిమా తెరకెక్కిస్తానని తెలిపి షాక్ ఇచ్చారు. గతంలో కూడా పలు రాజకీయ నేతల బయోపిక్ లు తెరకెక్కించి రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ బయోపిక్ ఫై ఫోకస్ పెట్టాడు. మరి ఈ మూవీ ఎలా తీస్తాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All