
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు తన నటన తో ఆకట్టుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చరణ్ లో కొత్త నటుడ్ని చూసినట్లు ఉందని చెపుతుండడం తో ఎంతో సంతోష పడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటె ఈ మధ్యనే చరణ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే ..
ఈ ఇంటిని చరణ్ దంపతులు మరింత అందంగా కనిపించేలా మార్పుచేర్పులు చేశారు. ఇంటర్నేషనల్ స్టైల్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, స్విమ్మింగ్ పూల్, పెయింటింగ్స్, జిమ్ సకల సదుపాయాలు ఉన్న ఈ ఇంటిని మరింత మోడ్రన్‌గా కనిపించేలా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. సుమారు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఇంటిని సొంతం చేసుకోవడం కోసం మెగా హీరో రూ.30 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు రామ్ చరణ్ 37వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్బంగా ఉదయం నుండి అభిమానులు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందిస్తూ వస్తున్నారు.