
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఆర్ఆర్ఆర్ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా దాదాపు 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రస్తుతం హౌస్ ఫుల్ తో రన్ అవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ థియేటర్ లో సడెన్ ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆనందంలో పడేసారు.
ముంబైలోని బాంద్రాలో ఉన్న Gaitey థియేటర్ లోకి రామ్ చరణ్ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. థియేటర్లో సీరియస్ గా సినిమా చూస్తున్న ప్రేక్షకుల ముందుకు సడన్ గా రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాకయ్యారు. ఆ తరువాత చరణ్ ను ప్రేక్షకులు సాదరంగా ఆహ్వానించారు. చరణ్ తో ఫోటోస్ దిగేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం ఆ తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.