
ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన భారీ పాన్ మూవీ ఆర్ఆర్ఆర్.మరికాసేపట్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావడం , ఎన్టీఆర్ , చరణ్ లు ఫస్ట్ టైం కలిసి నటించడం తో ఈ మూవీ ని మొదటి రోజు చూడాలని ఇరు అభిమానులు తహతహలాడుతున్నారు. ఇక గత పది రోజులుగా హీరోలు , దర్శకుడు రాజమౌళి అన్ని భాషల్లో ప్రమోషన్ చేస్తూ వచ్చారు.
తాజాగా ఎన్టీఆర్ ఇంకా అదే ట్రాన్స్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. తెలుగు మీడియాతో మాట్లాడుతూ.. మరిచిపోయి హిందీలో ఆన్సర్ చెప్పేశాడు. దీంతో రాజమౌళి, పక్కనే ఉన్న రామ్ చరణ్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎన్టీఆర్.. ఇది నార్త్ కాదు సౌత్.. అవన్నీ అయిపోయాయి.. ఇది తెలుగు అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. యాంకర్ తెలుగులో అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ హిందీలో ఆన్సర్ చెప్పడంతో రామ్ చరణ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
Konchem rest tisko anna ? @tarak9999 pic.twitter.com/ssfKcelVK1
— Prince (@kickVasimalla) March 24, 2022