
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కలయిల్లలో ఓ సినిమా వస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా పలు పిక్స్ , విషయాలు బయటకు వస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..తాజాగా ఈ మూవీలో తన పాత్రను బయటకు రివీల్ చేసాడు రామ్ చరణ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబురాల్లో భాగంగా ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్..తనకు సర్వీసుల పట్ల ఉన్న ప్రేమను తెలిపారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో తాను ఐపీఎస్ (IPS)ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నానని చెప్పారు. ఆ ఫిల్మ్ కథలో భాగంగా తను ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి చదువుకుని మళ్లీ ఐఏఎస్(IAS) ఆఫీసర్ గా పాస్ అవుతానని పేర్కొన్నాడు. అలా తన పాత్రలోని వేరియేషన్స్ ను చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఈ సంగతి తెలుసుకుని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈ చిత్రం రూపొందుతోంది. సునీల్, జయరాం, అంజలి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక చరణ్ ..తండ్రి చిరంజీవి తో కలిసి నటించిన ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శనివారం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ మూవీ ఫై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.