
ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ కు పాన్ ఇండియా లెవల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో చరణ్ ఎక్కడికెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తున్నారు. ప్రస్తుతం చరణ్..శంకర్ డైరెక్షన్లో తన 15 వ చిత్రం చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అమృత్ సర్ లో జరుగుతుంది. షూటింగ్ లో చరణ్ ను కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్య లో షూటింగ్ స్పాట్ కు చేరుకుంటున్నారు.
ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో రామ్ చరణ్ కూల్ గా మహిళా అభిమానుందరితో సెల్ఫీ దిగారు. సెక్యూరిటీ గార్డులను పక్కకు వెళ్లాలని సూచించి అందరితో చక్కగా బిహేవ్ చేశారు. ఇక ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక చిరంజీవి తో కలిసి నటించిన ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజల్ , పూజా హగ్దే లు హీరోయిన్లు గా నటించారు.