
ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఇప్పుడు ఆచార్య తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ లో చరణ్ ఓ కీలక పాత్ర పోషించాడు. దీంతో సినిమా ఫై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలు రెట్టింపు చేస్తూ సినిమా తాలూకా విశేషాలను ప్రమోషన్ లలో పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చరణ్ మాట్లాడుతూ..బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సినిమా రాబోతుందని తెలిపి అభిమానుల్లో సంతోషం నింపారు.
తన బ్యానర్ లో పవన్ కల్యాణ్ సినిమా చేయాలని, బాబాయ్ బ్యానర్ లో తాను సినిమా చేయాలనే ఆలోచనలున్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో డెఫినెట్ గా ఫ్యామిలీ స్టార్స్ తోనే రామ్ చరణ్ మంచి సినిమాలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘డ్రైవింగ్ లైసెన్స్, బ్రో డాడీ’ రీమేక్ రైట్స్ మెగా ఫ్యామిలీ వారు తీసుకున్నారని సమాచారం. వీటిని మెగా హీరోలతోనే చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.