Homeటాప్ స్టోరీస్ఆచార్య డబ్బింగ్ లో బిజీ గా ఉన్న రామ్ చరణ్

ఆచార్య డబ్బింగ్ లో బిజీ గా ఉన్న రామ్ చరణ్

ram charan busy in acharya dubbing
ram charan busy in acharya dubbing

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమములు జరుపుకుంటుంది. ఈ తరుణంలో రామ్ చరణ్ తన పాత్ర తాలూకా డబ్బింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో నిర్మాత అన్వేష్ రెడ్డి సినిమాలోని హైలైట్ సన్నివేశాన్ని బయటకు తెలిపి.. అభిమానుల్లో పూనకాలు పుట్టించారు.

తండ్రీ కొడుకులు కలిసి దాదాపు 25 నిమిషాల స్క్రీన్ టైమ్ తో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని వెల్లడించారు. వాస్తవానికి చిరు-చరణ్ వ్యక్తిగతంగా సినిమా అంతటా అనేక సన్నివేశాలను కలిగి ఉన్నారు. అయితే సుమారు 20 నుండి 25 నిమిషాల పాటు ఆ ఇద్దరూ కలిసి స్క్రీన్ ను పంచుకుంటారు అని అన్వేష్ రెడ్డి ధృవీకరించారు. ఇక ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిరంజన్రెడ్డి- అన్వేష్రెడ్డి నిర్మిస్తున్నారు. సోనూ సూద్, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్, బెనర్జీ కీలక పాత్రల్లో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All