
గడ్డకట్టే మంచులో కాసేపు ఉంటేనే వణికిపోతాం..అలాంటిది అంత మంచులో సరదాగా ఆడుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు మెగా దంపతులు రామ్ చరణ్ , ఉపాసన. గత మూడేళ్లుగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా షూటింగ్ లోనే గడిపిన చరణ్.. ఉపాసనతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లారు. ప్రస్థురం చరణ్ #RC15 షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ కాస్త బ్రేక్ తీసుకొని విహారయాత్రకు వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఈ సెలెబ్రిటీ కపుల్ ఫిన్లాండ్ లో క్వాలిటీ టైం గడుపుతున్నారు. తమ వయసును తగ్గించుకొని చిన్న పిల్లలల ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టూర్ కి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇందులో మెగా కపుల్ ఎయిర్ పోర్ట్ లో లగేజ్ ట్రాలీపై ఆటలాడుతూ కనిపించారు. మంచు కొండల్లో ఇద్దరూ సరదాగా గడుపుతూ.. పెట్ డాగ్స్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.