Homeగాసిప్స్`ఆర్ ఆర్ ఆర్‌`లో ఎవ‌రి వాటా ఎంత‌?

`ఆర్ ఆర్ ఆర్‌`లో ఎవ‌రి వాటా ఎంత‌?

`ఆర్ ఆర్ ఆర్‌`లో ఎవ‌రి వాటా ఎంత‌?
`ఆర్ ఆర్ ఆర్‌`లో ఎవ‌రి వాటా ఎంత‌?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్‌కి ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ప్రిరిలీజ్ బిజినెస్ ప‌రంగా ఈ సినిమా అన్ బ్రేక‌బుల్ రికార్డ్స్‌ని సొంతం చేసుకుంటోంద‌ని వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ 450 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా 75 కోట్లు రైట్స్‌కు డిమాండ్ ఏర్ప‌డిందని. అంత మొత్తం ఇచ్చి దిల్ రాజు సొంతం చేసుకున్నార‌ని తెలుస్తోంది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 215 కోట్ల మేర బిజినెస్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఓవ‌ర్సీస్‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, హిందీ రైట్స్‌, శాటిలైట్ రైట్స్.. ఇలా అన్ని రైట్స్ క‌లిపి భారీగానే వ‌సూల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని తెలిసింది.ఇదిలా వుంటే మ‌రి ఈ చిత్రంలో న‌టిస్తున్న టాప్ స్టార్స్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఎంత తీసుకుంటున్నారు?. అస‌లు వారి రెమ్యున‌రేష‌న్ ఎంత అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

ఈ చిత్రానికి రాజ‌మౌళి, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పారితోషికం తీసుకోవ‌డం లేద‌ట‌. సినిమాకు వ‌చ్చిన లాభాల్లో వాటా తీసుకుంటున్నార‌ని, ఈ మేర‌కు వారి మ‌ధ్య ఒప్నందం జ‌రిగింద‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దాదాపు ఈ హీరోలిద్ద‌రు 50 నుంచి 100 కోట్ల మ‌ధ్య వాటాగా తీసుకుంటార‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All