Homeగాసిప్స్చరణ్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడట

చరణ్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడట

ram charan 2 different roles in shankar movie
ram charan 2 different roles in shankar movie

ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న చరణ్..త్వరలో ఆచార్య మూవీ తో రాబోతున్నాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే శంకర్ డైరెక్షన్లో తన 15 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలు అయ్యి , పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

ఇక ఈ మూవీ లో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా.. అయితే ఒక పాత్రలో స్టూడెంట్ గా , మరొక పాత్రలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించబోతున్నాడట. రామ్ చరణ్ ను గతంలో ఎన్నడూ లేనివిధంగా విభిన్నమైన పాత్రల్లో శంకర్ చూపించబోతున్నట్లు సమాచారం. మరి ఆ రెండు పాత్రల్లో చరణ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇక ఈ మూవీ లో చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా..శ్రీకాంత్ , అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..దిల్ రాజు నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All