
రామ్ – బోయపాటి కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న రామ్..ఆ తర్వాత రెడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్లో ది వారియర్ అనే మూవీ చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు , తమిళ్ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే బోయపాటి శ్రీను డైరెక్షన్లో మాస్ ఎంటర్టైనర్ లో నటించేందుకు ఓకే చెప్పాడు. ఈ సినిమాలో రామ్ కు జోడిగా రష్మిక ను ఎంపిక చేశారు. కాగా ఈ మూవీ ఇప్పటికే సెట్స్ పైకి రావాల్సి ఉండగా సెకండ్ హీరోయిన్ కారణంగానే ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది.
సినిమాలో సెకండ్ హీరోయిన్ బాలీవుడ్ భామ అయితే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెకండ్ లీడ్ పై ఇప్పటివరకు క్లారిటీ రాకపోవడంతోనే రామ్ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ రావడం లేదని అంటున్నారు. మరోవైపు రష్మిక కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొంటుందో చెప్పడం కష్టమే. రెండో హీరోయిన్ ఫైనల్ అయ్యాకే ఈ ప్రాజెక్టుపై కొత్త న్యూస్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ కి 20వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.