Homeటాప్ స్టోరీస్ఆ హీరో రిస్క్ చేస్తున్నాడు కానీ తప్పదు మరి

ఆ హీరో రిస్క్ చేస్తున్నాడు కానీ తప్పదు మరి

Ram and puri jagannadh movie on cardsయంగ్ హీరో రామ్ తాజాగా ప్లాప్ లలో ఉన్న దర్శకులు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరో రామ్ కు గతకొంత కాలంగా వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి , ఇక పూరి జగన్నాధ్ పరిస్థితి గురించి చెప్పాల్సిన పనే లేదు ….. హిట్ అనేది ఎలా ఉంటుందో తెలియక చాలా సంవత్సరాలు అవుతోంది . అయితే ఈ ఇద్దరూ సక్సెస్ కోసం కలుస్తున్నారు . రెండు ప్లాప్ లు కలిస్తే అతిపెద్ద డిజాస్టర్ లేదంటే , కాలం కలిసి వస్తే హిట్ కొట్టొచ్చు కదా అన్న ఆశతో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు .

ఇక ఈ సినిమాని పూరి జగన్నాధ్ – రామ్ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు . వచ్చే నెలలో సెట్స్ మీదకు ఈ సినిమా వెళ్లనుంది . ఈ కథ రామ్ ని కొంతవరకు ఇన్ స్పైర్ చేసి ఉంటుంది అందుకే కాబోలు వడ్డీతో సహా చెల్లిస్తాను మిత్రమా ! అంటూ మొన్నామధ్య పోస్ట్ చేసాడు రామ్ . పూరి కూడా చాలా రోజులుగా హిట్ కోసం తపించి పోతున్నాడు పాపం . మరి ఈ సినిమాతోనైనా హిట్ మొహం చూస్తాడో చూడాలి .

- Advertisement -

English Title: Ram and puri jagannadh movie on cards

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All