
బాలీవుడ్ డ్రగ్స్ వివాదం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాలు వాడుతున్నారన్న ఆరోపణలతో తాజాగా దీపికా పదుకునే, రకుల్, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బోర్ట్ అధికారుల ముందు గురువారం రకుల్ హాజరు కావాల్సి వుంది. అయితే రకుల్‌కు ఎన్సీబీకి సంబంధించిన సమన్లు అందలేదని అందుకే ఆమె గురువారం హాజరు కాలేకపోయిందని రకుల్ లీగల్ టీమ్ వెల్లడించింది.
అయితే ఇలా వెల్లడించిన వెంటనే రకుల్‌కు సమన్లు అందాయని, శుక్రవారం ఎన్సీబీ అధికారుల ముందు ఆమె హాజరు కాబోతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి కెపీఎస్ మల్హోత్ర రకుల్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. మేము అమెకు సమన్లు జారీ చేశాం. ఫోన్, ఇతర ప్లాట్ ఫామ్‌ల ద్వారా ఆమెని సంప్రదించడానికి ప్రయత్నించాం. కానీ ఆమె మాకు అందుబాటులోకి రాలేదు. మాకు ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు` అని వెల్లడించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత అతని మృతికి డ్రగ్స్ లింక్ వుందన్న కోణంలో ఎన్సీబీ అధికారులు విచారణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాని అదుపులోకి తీసుకోవడంతో పలువురి పేర్లకు డ్రగ్స్‌కి సంబంధం వున్నట్టు ఆధారాలు బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ వాడుతున్న వారిని ఎన్సీబీ అధికారులు విచారణకు పిలుస్తూ సమన్లు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.