Homeటాప్ స్టోరీస్రకుల్ తమ్ముడి సినిమా ప్రారంభం

రకుల్ తమ్ముడి సినిమా ప్రారంభం

Rakul preet singh brother Aman debut film launchedహీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్  హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఈరోజు అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభమైంది . దాసరి లారెన్స్ దర్శకత్వంలో రజనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .  ఈ చిత్ర  ప్రారంభోత్సవ వేడుకకు రకుల్ ప్రీత్ సింగ్ తో పాటుగా మంచు లక్ష్మి ,సందీప్ కిషన్ , రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు . ముహూర్తపు షాట్ కు రకుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్టగా మంచు లక్ష్మి గౌరవ దర్శకత్వం వహించింది ఇక కెమెరా స్విచాన్ చేసింది హీరో సందీప్ కిషన్ .

 

- Advertisement -

అమన్ – మోనికా శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది . తన సోదరుడు నటనలో అలాగే డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్నాడని , అతడికి నటన పట్ల ప్యాషన్ ఉందని …… నన్ను ఆదరించినట్లుగానే నా తమ్ముడ్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు . సినిమారంగం అంటే ఎలాగూ వారసుల రాజ్యం అనే విషయం తెలిసిందే . మరి రకుల్ సోదరుడు హీరోగా సక్సెస్ అవుతాడో లేదో తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: Rakul preet singh brother Aman debut film launched

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All