Homeటాప్ స్టోరీస్తాకరాని చోట తాకాడని పోలీసులకు ఫిర్యాదు

తాకరాని చోట తాకాడని పోలీసులకు ఫిర్యాదు

raksha complaint against shanmugarajanనా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని , తాకరాని చోట తాకాడని ఆరోపిస్తూ చెన్నై పోలీసులను ఆశ్రయించింది నటి , ఐటెం గర్ల్ రాణి అలియాస్ రక్ష . తమిళ , తెలుగు , కన్నడ చిత్రాల్లో నటించిన భామ రక్ష అయితే తెలుగులో రక్ష గా పేరున్న ఈ భామ ఇతర బాషలలో మాత్రం రాణి గా రాణించింది . క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే ఐటెం గర్ల్ గా రాణించిన ఈ భామ తాజాగా సీరియల్ లలో నటిస్తోంది . తాజాగా ఈ భామ ఓ తమిళ సీరియల్ లో నటిస్తున్న సమయంలో సహ నటుడు షణ్ముగ రాజన్ రక్ష పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట , చేతులు కూడా వేయడంతో షాక్ అయిన రక్ష వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిందట . రక్ష ఫిర్యాదు మేరకు షణ్ముగ రాజన్ పై కేసు నమోదు చేసారు చెన్నై పోలీసులు .

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది , అలాగే తమిళ సీరియల్ లలో కూడా నటిస్తోంది . కాస్టింగ్ కౌచ్ , మీ టూ ఉద్యమాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృస్తిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది . ఒక్కో బాధితురాలు బాహ్య ప్రపంచంలోకి వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు . పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు .

- Advertisement -

English Title: raksha complaint against shanmugarajan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All