Homeటాప్ స్టోరీస్2. ఓ మొదటి రోజున 125 కోట్ల వసూళ్లు

2. ఓ మొదటి రోజున 125 కోట్ల వసూళ్లు

Rajinikanth's 2. 0 earning125 crores on first day రజనీకాంత్ నటించిన విజువల్ వండర్ 2. ఓ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 వేల స్క్రీన్ లలో రిలీజ్ చేసారు 2. ఓ చిత్రాన్ని . దాంతో మొదటి రోజున 125 కోట్ల భారీ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది . కరెక్ట్ ఫిగర్ మధ్యాహ్నం కు రానుండగా ప్రాథమిక అంచనా ప్రకారం 125 కోట్లు వసూల్ అయినట్లు అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు . రజనీకాంత్ కున్న క్రేజ్ కి తోడు శంకర్ , అక్షయ్ కుమార్ ల ఇమేజ్ కూడా ఈ భారీ వసూళ్ల కు కారణం .

ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది దాంతో మొదటి వారం కూడా భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది . రెహ్మాన్ నేపథ్య సంగీతం , శంకర్ టేకింగ్ , విజువల్ గ్రాండియర్ వీటన్నింటిని మించి రజనీకాంత్ నటన 2. ఓ చిత్రాన్ని సూపర్ హిట్ చేసాయి . తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల చేసారు . 2. ఓ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు శంకర్ ని రజనీకాంత్ , అక్షయ్ కుమార్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .

- Advertisement -

English Title: Rajinikanth’s 2. 0 earning125 crores on first day

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All