Homeటాప్ స్టోరీస్పెద్దన్న : రివ్యూ

పెద్దన్న : రివ్యూ

Rajinikanth Peddanna Review Rating
 

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ డైరక్షన్ లో వచ్చిన సినిమా పెద్దన్న. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా సినిమాలో కీలక పాత్రలో కీర్తి సురేష్ నటించింది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినీమ ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

- Advertisement -

పచాయితీలోని పది గ్రామాలకు ప్రెసిడెంట్ గా ఉంటూ వారి మంచి చెడ్డలు చూసుకుంటాడు వీరన్న (రజనీకాంత్) అందరు అతన్ని పెద్దన్న అని పిలుచుకుంటారు. అలాంటి వీరన్నకి కనక మహాలక్ష్మి (కీర్తి సురేష్) తన చెల్లి అంటే ప్రాణం. ఆమె తలచుకుంటే చాలు అక్కడకు వచ్చేస్తాడు అంత ఇష్టం ఆమె అంటే. చెల్లెలిని అల్లరుముద్దుగా చూసుకునే వీరన్న ఆమెకు అనేక సంబంధాలు చూస్తాడు. అవేవి కుదరవు. ఫైనల్ గా ఓ అబ్బాయితో ఆమె పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అయితే పెళ్లి టైం కు మహాలక్ష్మి కనిపించదు. ఆమె నచ్చిన వ్యక్తితో వెళ్లిపోయిందని తెలుస్తుంది. వీరన్నకు దూరంగా వెళ్లిన మహా లక్ష్మి చాలా ఇబ్బందులు పడుతుంది. అది తెలుసుకున్న వీరన్న ఆమెకు తెలియకుండా వాటిని సాల్వ్ చేస్తుంటాడు. ఇంతకీ మహాలక్ష్మి ఎలా ఇబ్బందుల్లో పడ్డది..? వీరన్న చెల్లిని ఎలా కాపాడాడు..? ఆమె కష్టాలను ఎలా తీర్చాడు..? అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

డైరక్టర్ శివ సినిమా అంటే యాక్షన్ ఎంటర్టైనర్ అని ఆడియెన్స్ ఫిక్స్ అవుతారు. ఆయన తీసిన అన్ని సినిమాలు అలానే ఉంటాయి. అయితే అంతకుముందు సినిమాల్లో యాక్షన్ కు కావాల్సిన ఎమోషన్ ఉండేది.. కాని పెద్దన్న సినిమాలో ఆ ఎమోషన్ మిస్సయ్యిందని చెప్పొచ్చు.

చెల్లంటే ప్రాణం అనుకునే ఓ అన్న కథగా పెద్దన్న సినిమా తీశారు. అయితే అంతగా ప్రాణంగా చూసుకునే చెల్లి ఇష్టాలను గుర్తించకపోవడం అర్ధం కాని పాయింట్. ఒకవేళ ఆమె ఎవరినైనా ఇష్టపడినా అన్న మనసు మంచిదే చెల్లి ఇష్టాన్ని కాదనడు కాబట్టి పెద్దన్నకు చెప్పొచ్చు. ఇలా లాజిక్ లేని కథ, కథనాలతో సినిమా నడుస్తుంది.

ఇక రజినీ ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేందుకు మాత్రం 10 నిమిషాలకు ఒక ఫైట్ పెట్టాడు శివ. ఆ ఫైట్స్ కు అర్ధం పర్ధం ఉండదని అనిపిస్తుంది. రజినీ స్టైల్ ఫ్యాన్స్ ను సూపర్ అనేలా చేస్తున్నా మరోపక్క అసలు ఇక్కడ ఇంత రచ్చ ఎందుకు అనేలా చేస్తుంది. చెల్లి ఇబ్బందుల్లో ఉంటే ఆమెకు తెలియకుండా అన్న సాయం చేయడం ఇదంతా ఒకప్పటి బ్లాక్ అండ్ వైట్ కాలం కథగా అనిపిస్తుంది. ఓవరాల్ గా రజినీ లాంటి స్టార్ హీరోతో ఒక రొటీన్ కథతో వచ్చి ప్రేక్షకులను నిరుత్సాపరచారు.

నటీనటుల ప్రతిభ :

రజినీకాంత్ ఎప్పటిలానే తనకు ఇచ్చిన పాత్రను అదరగొట్టేశారు. ఈ సినిమాలో ఆయన యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అయితే అవి ఆయన ఫ్యాన్స్ కు కిక్ ఇస్తాయని చెప్పొచ్చు. ఇక నయనతార నటన జస్ట్ ఓకే. మహాలక్ష్మి పాత్రలో కీర్తి సురేష్ బాగానే చేసింది. మీనా, ఖుష్బు పాత్రలు సోసోగా ఉన్నాయి. జగపతి బాబు తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతిక వర్గం పనితీరు :

వెట్రి సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సినిమాకు కావాల్సిన కలర్, కీమెరా వర్క్ బాగుంది. ఇక ఇమ్మాన్ మ్యూజిక్ పెద్దగా మెప్పించలేదు. ఒక్క సాంగ్ రిజిస్టర్ అవలేదు. బిజిఎం బాగానే ఇచ్చాడు. డైరక్టర్ శివ అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు. రొటీన్ కథ అంతకన్నా రొటీన్ కథనాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

రజిని స్టైల్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

కథ, కథనం

అవుట్ డేటెడ్ సెంటిమెంట్

యాక్షన్ సీన్స్

బాటం లైన్ :

పెద్దన్న.. రొటీన్ సెంటిమెంట్ సినిమా..!

రేటింగ్ : 2/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All