Homeటాప్ స్టోరీస్ఎనిమిదేళ్ల తర్వాత హిట్ కొట్టిన రజనీకాంత్

ఎనిమిదేళ్ల తర్వాత హిట్ కొట్టిన రజనీకాంత్

Rajinikanth gets solid hit after eight yearsసూపర్ స్టార్ రజనీకాంత్ ఎనిమిదేళ్ల తర్వాత హిట్ కొట్టాడు . 2010 లో వచ్చిన రోబో చిత్రం సంచలన విజయం సాధించింది . శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో చిత్రం తర్వాత రజనీకాంత్ నటించిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందాయి . రజనీకాంత్ సూపర్ స్టార్ కావడంతో అతడి నుండి వస్తున్న చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రాలన్నీ డిజాస్టర్ లు అయ్యాయి , దాంతో రజనీకాంత్ సినిమాలను కొన్న బయ్యర్లు రోడ్డున పడ్డారు . రోబో తర్వాత కొచ్చాడైయాన్ , లింగా , కబాలి , కాలా చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి .

ఈ ఎనిమిదేళ్ల కాలంలో చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ కావడంతో రజనీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు కట్ చేస్తే నిన్న విడుదలైన 2 . ఓ చిత్రం తో మళ్ళీ హిట్ అందుకున్నాడు రజనీకాంత్ దాంతో రజనీ అభిమానుల సంతోషానికి అంతే లేకుండా పోయింది . ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు 2. ఓ రూపంలో హిట్ లభించడం తో రజనీకాంత్ కూడా ఫుల్ ఖుషీ గా ఉన్నాడట . 2. ఓ సక్సెస్ కొట్టింది కానీ ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో అన్న ఆత్రుత నెలకొంది .

- Advertisement -

English Title: Rajinikanth gets solid hit after eight years

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All