Homeటాప్ స్టోరీస్రికార్డులు బద్దలు కొడుతున్న 2.0 ట్రైలర్

రికార్డులు బద్దలు కొడుతున్న 2.0 ట్రైలర్

Rajinikanth 2.0 trailer trending in youtubeనిన్న చెన్నై మహానగరంలో ఎంతో అట్టహాసంగా విడుదలైన 2. 0 ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది . సూపర్ స్టార్ రజనీకాంత్ , బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ లు నటించిన ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించాడు . 540 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ 29 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా నిన్న విడుదలైన ట్రైలర్ కు అనూహ్య స్పందన వస్తోంది . ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సినిమా తాలూకు ట్రైలర్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు వీక్షించడం మొదలు పెట్టారు దాంతో హిందీలో 10 మిలియన్ లకు పైగా వ్యూస్ వచ్చాయి అలాగే తమిళ్ ట్రయిలర్ కు 8 మిలియన్ వ్యూస్ , తెలుగులో మూడున్నర మిలియన్ వ్యూస్ దాటాయి మొత్తంగా ఒక్క రోజులోనే 25 మిలియన్ వ్యూస్ ని చేరుకోవడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు .

అయితే ఈ ట్రైలర్ కు ఇంతగా వ్యూస్ రావడానికి కారణం ఎలా ఉందో తెలుసుకోవడానికి మాత్రమే ! అంతేకాని అద్భుతంగా ట్రైలర్ ఉందని కాదు . రజనీ మేనియా శంకర్ కున్న క్రేజ్ మొత్తానికి ఈ స్థాయిలో వ్యూస్ రావడానికి రీజన్ . ఇక సినిమా అయినా శంకర్ రేంజ్ లో ఉంటుందా ? లేదా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాల్సిందే లేకపోతే నిర్మాతతో పాటు బయ్యర్లు నష్టపోవడం ఖాయం .

- Advertisement -

English Title: Rajinikanth 2.0 trailer trending in youtube

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All