
గరుడ వేగ మూవీ తో హిట్ అందుకున్న రాజశేఖర్..తాజాగా శేఖర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజశేఖర్ సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, మలయాళంలో సూపర్ హిట్టయిన జోసేఫ్ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుదల కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రానికి మొదట లలిత్ దర్శకత్వం వహించాడు. కాని కొన్ని కారణాల వల్ల అతను తప్పుకున్నాడు. దాంతో జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. మరి ఈ మూవీ రాజశేఖర్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.