
`పీఎస్‌వీ గరుడవేగ` చిత్రంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు యాంగ్రీ యంగ్‌మెన్ డా. రాజశేఖర్. సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల తరువాత తన అస్థిత్వాన్ని కాపాడు కోవడం కోసం రాజశేఖర్ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. `పీఎస్‌వీ గరుడవేగ` తరువాత ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ `కల్కీ` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
సి.కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం గుడ్ టాక్‌ని సొంతం చేసుకున్నా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో చతికిలపడింది. దీంతో కొంత విరామం తీసుకున్న రాజశేఖర్ మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో మరో థ్రిల్లర్ స్టోరీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి `మిస్పమ్మ` ఫేమ్ నీలకంఠ దర్శకత్వం వహించబోతున్నారు.
థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరపైకి రానున్న ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో రాజశేఖర్ కనిపించనున్నారట. హీరోయిన్ ఇంకా ఫైనల్ కానీ ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ని ఈ నెల 7 నుంచి ప్రారంభించబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే నాగార్జునతో పాటు చైతూ, బెల్లంకొండ శ్రీనివాస్, పవన్‌కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రాలు పునః ప్రారంభం కావడంతో రాజశేఖర్ కూడా తన చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు తెలిసింది.