
దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి రాధే శ్యామ్ చిత్రాన్ని వీక్షించారు. మూడేళ్ల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన చిత్రం రాధే శ్యామ్. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రంలో సీనియర్ నటులు కృష్ణంరాజు, అలనాటి అందాల తార భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించారు. టీ సిరీస్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించిన రాధేశ్యామ్ చిత్రం మొత్తం 5 భాషల్లో రిలీజ్ అయ్యింది.
కేవలం అభిమానులు, సినీ ప్రేక్షకులే కాదు చిత్రసీమ ప్రముఖులు సైతం ఉదయం నుండి సినిమా యూనిట్ బెస్ట్ విషెష్ అందిస్తూ సినిమా కు బజ్ తీసుకొచ్చారు. మరికొంతమంది ఉదయం షో కే వెళ్లి సినిమా చూసారు. రాజమౌళి కూడా కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంట్లోనే షో వేసుకొని చూడడం జరిగింది. దీని తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో షేర్ చేయడం తో వైరల్ గా మారాయి. ఇక రాజమౌళి – ప్రభాస్ ల గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో ఛత్రపతి , బాహుబలి సిరీస్ లు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు అయ్యాయి. త్వరలోనే మరోసారి వీరి కలయికలో సినిమా రాబోతుంది.