Homeటాప్ స్టోరీస్రాజమౌళి చెప్పొద్దన్నాడట

రాజమౌళి చెప్పొద్దన్నాడట

rajamouli warns charan ఇంతవరకు మాకు రాజమౌళి కథ చెప్పలేదని , అంతేకాదు బయట దీనికి సంబందించిన విషయం ఏది చెప్పొద్దని గట్టిగా హుకుం జారీ చేసాడు అందుకే ఏమి చెప్పేది లేదు అయినా కథ కూడా నాకు పూర్తిగా తెలీదు అని అంటున్నాడు హీరో రాంచరణ్ . ప్రస్తుతం ఈ హీరో రంగస్థలం చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 30న భారీ ఎత్తున విడుదల కానుంది . దాంతో మీడియా ముందుకు వచ్చిన చరణ్ పై వ్యాఖ్యలు చేసాడు .

బాహుబలి లాంటి సిరీస్ ల తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఎన్టీఆర్ , చరణ్ లు నటించనున్నారు . మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కావడంతో ఈ సినిమా ప్రకటించకముందు నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకే ఆ సినిమాకు సంబందించిన విషయాలు గోప్యాంగా ఉంచాలని భావిస్తున్నాడు రాజమౌళి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All