Homeటాప్ స్టోరీస్`ఆర్ ఆర్ ఆర్` హిందీ రైట్స్ క‌ర‌ణ్‌కి ఇవ్వ‌లేదా?

`ఆర్ ఆర్ ఆర్` హిందీ రైట్స్ క‌ర‌ణ్‌కి ఇవ్వ‌లేదా?

`ఆర్ ఆర్ ఆర్` హిందీ రైట్స్ క‌ర‌ణ్‌కి ఇవ్వ‌లేదా?
`ఆర్ ఆర్ ఆర్` హిందీ రైట్స్ క‌ర‌ణ్‌కి ఇవ్వ‌లేదా?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టిస్తుండ‌టం, 1920 కాలంగా నాటి ఇద్ద‌రు పోరాట యోధుల క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ సినిమాపై యావ‌త్ దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్ప‌డింది. దీనికి `బాహుబ‌లి` కూడా ఓ కార‌ణం. ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగా రాజ‌మౌళి పేరు మారు మ్రోగిపోయింది. ఆ క్రేజే ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్‌`కు భారీ మార్కెట్‌ని క్రియేట్ చేసింది.

ఇదిలా వుంటే ఉగాది సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌, శుక్ర‌వారం రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజ‌ర్ వీడియో సినిమాపై మ‌రింత క్రేజ్‌ని పెంచేశాయి. దీంతో సినిమా మార్కెట్ స్థాయి కూడా భారీగానే ప‌లికిన‌ట్టు తెలిసింది. `బాహుబ‌లి` చిత్రాన్ని క‌ర‌ణ్ జోహ‌ర్‌కి అమ్మేసిన రాజ‌మౌళి అండ్ కో… `ఆర్ ఆర్ ఆర్‌` చిత్ర హిందీ వెర్ష‌న్ అనువాద హ‌క్కుల్ని మాత్రం ఈ సారి క‌ర‌ణ్ జోహ‌ర్‌కి ఇవ్వ‌లేద‌ని తెలిసింది.

- Advertisement -

అయితే ఎవ‌రికిచ్చారు?.. ఇంకీ ఈ నిర్మాత ఎవ‌రు? … హీరోయిన్ ర‌వీనా టాండ‌న్ భ‌ర్త అనిల్ త‌డానీ `ఆర్ ఆర్ ఆర్` హిందీ అనువాద హ‌క్కుల్ని సొంతం చేసుకున్నార‌ట‌. ఇందు కోసం ఆయ‌న భారీ మొత్తం ఇచ్చిన‌ట్టు తెలిసింది. అయితే క‌ర‌ణ్ జోహార్ త‌ర‌హాలో అనిల్ త‌డానీ `ఆర్ ఆర్ ఆర్‌` కు ప్ల‌స్ అవుతారా?.. క‌ర‌ణ్ జోహార్ త‌ర‌హాలో `బాహుబ‌లి`కి తెచ్చిన క్రేజ్‌ని బాలీవుడ్‌లో తీసుకురాగ‌ల‌రా? అన్న‌దే ఇప్పుడు టాలీవుడ్ వ‌ర్గాల్లో అనుమానాన్ని క‌లిగిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All