Homeగాసిప్స్రాజమౌళి ఎందుకు వెనక్కి తగ్గాడు?

రాజమౌళి ఎందుకు వెనక్కి తగ్గాడు?

రాజమౌళి ఎందుకు వెనక్కి తగ్గాడు?
రాజమౌళి ఎందుకు వెనక్కి తగ్గాడు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్ కారణంగా ఏ మూవీ షూటింగ్ ఆగిపోయింది. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ షూటింగ్స్ చేసుకుంటామని ఇండస్ట్రీ వర్గాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వ నిభందనలు పాటిస్తూ షూటింగ్స్ చేసుకోమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈనెల 25,26 తేదీల్లో డూప్ లతో టెస్ట్ షూట్ చేయాలని రాజమౌళి ప్లాన్  చేశారు. ఆరోజు కోసం ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇండస్ట్రీ అంతా అటెన్షన్ తో ఎదురు చూసినరోజు రానే వచ్చింది. ఈ నెల 25, 26 తేదీల్లో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం డూప్ లతో టెస్ట్ షూట్ చేస్తానని అంతా సిద్ధం చేసుకున్నారు. గండిపేట్ లో ప్రత్యేకంగా దీనికోసం ఓ భారీ సెట్ ని సాబూ సిరిల్ తో వేయించారు.
ఇక్కడే టెస్ట్ షూట్ అన్నారు. కట్ చేస్తే టెస్ట్ షూట్ క్యాన్సిల్ అయ్యింది. కారణం రెండు రోజుల క్రితం టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కు కరోనా సోకడమే అని తెలిసింది. పైగా తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసు లు ఈనెల 24 వరకు 10,000 దాటడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఈ టైములో ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎందుకని భావించిన రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్. టెస్ట్ షూట్ ని క్యాన్సిల్ చేసినట్టు తెలిసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All