Homeటాప్ స్టోరీస్ఆ సినిమా వాయిదాపడింది

ఆ సినిమా వాయిదాపడింది

raj taruns rajugadu release postponedయంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ” రాజుగాడు ” చిత్రాన్ని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉంది కానీ రకరకాల కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూనే ఉంది దాంతో ఎట్టకేలకు ఈనెల 11 న ఆ సినిమాని విడుదల చేయాలనీ అనుకున్నారు . కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 11 న విడుదల కావడం లేదు వాయిదా వేశారు . కారణాలు చెప్పడం లేదు కానీ జూన్ 1న రాజుగాడు సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

రాజ్ తరుణ్ హీరోగా నటించగా అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటించింది ఇక సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించారు . రాజుగాడు చిత్రంతో సంజనా దర్శకురాలి గా పరిచయం అవుతోంది . ఇక ఈ సినిమాని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది . ఈ సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ పరాజయం పాలు అవుతూనే ఉన్నాయి మరి ఈ సినిమా ఏమౌతుందో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All