Homeటాప్ స్టోరీస్రాజుగాడు పై నమ్మకం పెట్టుకున్న రాజ్ తరుణ్

రాజుగాడు పై నమ్మకం పెట్టుకున్న రాజ్ తరుణ్

rajtarun hopes on rajugaduయంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస చిత్రాలు చేస్తూ మంచి జోరు లో ఉండే కానీ రాజ్ తరుణ్ గత చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకున్నాడు . తాజాగా ఈ హీరో నటించిన ” రాజుగాడు ” విడుదలకు సిద్ధమైంది . సంజనా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ నటించింది . కాగా ఈ చిత్రాన్ని జూన్ 1 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

జూన్ 1న రాజుగాడు చిత్రంతో పాటుగా మరో నాలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయి దాంతో పోటీ ఎక్కువయ్యింది అయినప్పటికీ రాజుగాడు విజయం సాధిస్తాడని అంటున్నాడు రాజ్ తరుణ్ . ఎంటర్ టైన్ మెంట్ తో మా సినిమా సాగుతుందని కాబట్టి టెన్షన్ లేదని రాజుగాడు విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నాడు . రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో బాగానే ఉండేది కానీ గత ఏడాది బాగా డ్రాప్ అయ్యింది . చేస్తున్న సినిమాలు వరుసగా విడుదల అవుతూ ప్లాప్ బాట పడుతున్నాయి దాంతో స్వల్ప మార్పులు చేసి రాజుగాడు ని విడుదల చేస్తున్నారు . రాజ్ తరుణ్ నమ్మకం నిజమౌతుందో లేదో తెలియడానికి మరో ఆరు రోజులు ఆగితే తెలిసిపోతుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All