Homeటాప్ స్టోరీస్అనుభవించు రాజా : రివ్యూ

అనుభవించు రాజా : రివ్యూ

Raj Tarun Anubhavinchu Raja Review Rating
Raj Tarun Anubhavinchu Raja Review Rating

యువ హీరో రాజ్ తరుణ్ శ్రీను గవిరెడ్డి డైరక్షన్ లో ఖషిశ్ ఖాన్ హీరోయిన్ గా నటించిన సినిమా అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

- Advertisement -

సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యురిటీ గా చేస్తున్న రాజు (రాజ్ తరుణ్) ఆ కంపెనీలో పనిచేసే శ్రావణి (ఖషిశ్ ఖాన్) ప్రేమలో పడతాడు. అతను స్క్యురిటె అంటే సిస్టెం సెక్యురిటీ అనుకుని ఆమె అతన్ని ప్రేమిస్తుంది. అసలు విషయం తెలిసి కొద్దిరోజులు దూరం పెట్ట్టినా అతని మంచితనానికి మళ్లీ అతనికి దగ్గరవుతుంది. ఇక ఈ టైం లో గౌడీ గ్యాంగ్ ఎటాక్ వల్ల రాజు గతం తెలుస్తుంది. ఇంతకీ రాజు ఎవరు..? అతన్ని రౌడీ గ్యాంగ్ ఎందుకు వెంటపడింది..? అసలు రాజు గతం ఏంటి అన్నది చూడాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

వరుస సినిమాలు చేస్తున్నా సరైన సక్సెస్ లు లేని రాజ్ తరుణ్ ఆల్రెడీ తనతో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా చేసిన శ్రీను గవిరెడ్డితో అనుభవించు రాజా సినిమా చేశాడు. ఈ సినిమా కథ రొటీన్ గానే అనిపిస్తుంది. ఊళ్లో బాగా డబ్బున్న రాజు అనుకోకుండా ఓ మర్డర్ లో ఇరుక్కోవడం.. ఆ కేసులో అసలు ఏం జరిగింది అని కనిపెట్టే క్రమంలో రాజు సెక్యురిటీగా చేరడం ఆసక్తికరంగా ఉంటుంది.

సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం విలేజ్ లోనే లాగించారు. అయితే ఇక్కడే గ్రాఫ్ పడిపోయిందని చెప్పొచ్చు. సినిమా సెకండ్ హాఫ్ ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. రొటీన్ పద్ధతిలో తీసుకెళ్లాడు డైరక్టర్. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో లేదు.

అనుభవించు రాజా అంటూ విలేజ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఆశించిన ఆడియెన్స్ కు నిరాశ కలిగిస్తుంది. సినిమా అంతా రొటీన్ గా తీసుకెళ్లారు. మర్డర్ మిస్టర్ థ్రిల్ అవ్వకపోగా సిల్లీగా అనిపిస్తుంది. సగటు ప్రేక్షకుడు జస్ట్ ఓకే అనిపించేలా సినిమా ఉంది.

నటీనటుల ప్రతిభ :

రాజ్ తరుణ్ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే అతను ఎంత బాగా చేసినా కథ, కథనాల్లో మ్యాటర్ లేకపోవడంతో జస్ట్ ఓకే అనిపిస్తాడు. హీరోయి ఖషిశ్ ఖాన్ కూడా మాములుగానే అనిపిస్తుంది. సుదర్శన్ కొద్దిమేరకు కామెడీతో మెప్పించాడు. నరేన్, అజయ్ బాగానే చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. గోపీ సుందర్ ఈ తరహా మ్యూజిక్ పెద్దగా మెప్పించలేదని అర్ధమవుతుంది. సినిమా ట్రైలర్ తో ఆసక్తి కలిగేలా చేసిన దర్శకుడు శ్రీను గవిరెడ్డి సినిమాలో పెద్దగా ప్రతిభ కనబరచలేదు. రొటీన్ కథ, కథనాలతో సినిమా వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కొన్ని సరదా సన్నివేషాలు

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

కథనం

మ్యూజిక్

బాటం లైన్ :

రాజ్ తరుణ్ అనుభవించు రాజా.. ఒకసారి చూసేయొచ్చు..!

రేటింగ్ : 2.5/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All