Homeటాప్ స్టోరీస్టాలెంటెడ్ తెలుగు దర్శకులు.. మహేష్ తో సినిమా అంటున్నారు!

టాలెంటెడ్ తెలుగు దర్శకులు.. మహేష్ తో సినిమా అంటున్నారు!

టాలెంటెడ్ తెలుగు దర్శకులు.. మహేష్ తో సినిమా అంటున్నారు!
టాలెంటెడ్ తెలుగు దర్శకులు.. మహేష్ తో సినిమా అంటున్నారు!

టాలెంటెడ్ దర్శక ద్వయం రాజ్ – డీకే తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరి గురించి అంతగా తెలియక పోవచ్చు. అయితే వీరిద్దరూ కూడా తెలుగువారే. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నుండి వచ్చారు. ముంబై వెళ్లి దర్శకులుగా ప్రయత్నించి అవకాశాలు అందుకున్నారు. బాలీవుడ్ లో విభిన్నమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఫ్లేవర్స్, 99, షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసారు. అలాగే ‘స్త్రీ’ హారర్ కామెడీని నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు.

తెలుగులోనూ నిర్మాతలుగా ఓ చేయి వేశారు. అప్పట్లో డి ఫర్ దోపిడీ చిత్రాన్ని నానితో కలిసి నిర్మించారు కానీ అది సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. రీసెంట్ గా సినిమా బండి అంటూ ఒక ఇండీ ఫిల్మ్ ను సపోర్ట్ చేసారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ను త్వరలో విడుదల చేయనున్నారు.

- Advertisement -

మరి తెలుగులో సినిమాను ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు అని అడిగితే ఆ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని తెలిపారు వీరు. తాము మహేష్ బాబు, విజయ్ దేవరకొండలతో టచ్ లో ఉన్నామని, త్వరలో ఓ ప్రాజెక్ట్ ను సెట్ చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All