Homeటాప్ స్టోరీస్రాహుల్ ను ఫైనల్స్ కు పంపిన అలీ

రాహుల్ ను ఫైనల్స్ కు పంపిన అలీ

రాహుల్ ను ఫైనల్స్ కు పంపిన అలీ
రాహుల్ ను ఫైనల్స్ కు పంపిన అలీ

టాస్క్ లు ఆడటం రాదన్నారు. బద్ధకం ఎక్కువన్నారు. మౌసంబీలు తినడం తప్ప వేరే ఏం తెలీదన్నారు. కానీ మొదటగా బిగ్ బాస్ 3లో ఫైనల్స్ కు చేరాడు రాహుల్ సిప్లిగంజ్. నిన్న నాటకీయ పరిణామాల మధ్య జరిగిన టాస్క్ లలో రాహుల్ అందరి కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉంచుకుని మొదటగా ఫైనల్స్ కు చేరాడు. మిగిలిన ఐదుగురు ఇంటి సభ్యులు బాబా భాస్కర్, అలీ, శ్రీముఖి, వరుణ్, శివజ్యోతి నామినేషన్స్ లోకి వెళ్లారు. అంటే వీరిలోంచి ఒకరు ఎలిమినేట్ అవుతారన్నమాట. మిగిలిన నలుగురు ఫైనల్స్ లోకి అడుగుపెడతారు.

ఈ టాస్క్ లో రాహుల్ గెలిచాడు అనేకంటే అలీ పంపించాడు అనడం బెటర్ ఏమో. ఎందుకంటే టాస్క్ లను తక్కువగా అంచనా వేసి అలీ దెబ్బతిన్నాడు. నిన్న బాబా భాస్కర్ తో టాస్క్ లో ఎలాగైనా గెలవాలని చెప్పి బిగ్ బాస్ హెచ్చరిస్తున్నా సరే వినకుండా బాబా భాస్కర్ తో గొడవకు దిగాడు. తనను మాటిమాటికి తోసి కింద పడేసి చేయడంతో బిగ్ బాస్ ఈ టాస్క్ నుండి తప్పించాడు. దీంతో అలీ నామినేట్ అయ్యాడు. అలాగే మరోసారి ఇలా చేస్తే షో లో నుండి బయటకు పంపుతానని బిగ్ బాస్ హెచ్చరించాడు.

- Advertisement -

అలీకి టాస్క్ లు బాగా ఆడతాడని పేరుంది. అలా అని చెప్పి ప్రతి టాస్క్ ఎలాగైనా గెలిచేస్తానంటే ఎట్లా? ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఎలా పడితే అలా ఆడి ఇబ్బందులు కొనితెచ్చుకున్నాడు. నిజానికి ఈ టాస్క్ ఓడిపోయినా కూడా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న అలీ టికెట్ టు ఫినాలే గెలుచుకునేవాడే. కానీ ప్లానింగ్ సరిగ్గా లేని అలీ టాస్క్ నుండి బహిష్కరించబడి నెక్స్ట్ ఎక్కువ ఛార్జింగ్ ఉన్న రాహుల్ కు ఛాన్స్ ఇచ్చినట్లయింది.

నిన్న ఆల్రెడీ వరుణ్ తో ఆడి ఒక టాస్క్ గెలుచుకున్న రాహుల్, ఈరోజు శ్రీముఖితో కూడా తలపడి టాస్క్ గెలుచుకున్నాడు. దీంతో అందరికంటే ఎక్కువ ఛార్జింగ్ ఉన్న రాహుల్ ఫైనల్స్ కు చేరుకోవడానికి మార్గం ఈజీ అయింది. మొదట ఛార్జింగ్ ప్లేట్స్ తీసుకున్నప్పుడు 70 శాతం వచ్చినా కానీ అలీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మొదట నామినేషన్స్ లోకి వచ్చిన అలీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్, శివజ్యోతి నలుగురు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.

ఈ టాస్క్ కంప్లీట్ అయ్యాక కూడా అందుకే అలీని అందరూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. రాహుల్ కు అలీ గురువు అవుతాడని, ఫైనల్స్ కు పంపినందుకు చాలా థాంక్స్ అంటూ రాహుల్ కూడా అలీపై పంచ్ లు వేసాడు. ఇక నామినేషన్స్ టాస్క్ పూర్తవ్వడంతో రేపటినుండి ఎలాంటి టాస్క్ లు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ వారం అందరు కంటెస్టెంట్స్ కు చాలా కీలకం. ఈ ఒక్క వారం యాక్టివ్ గా ఉండి టాస్క్ లు బాగా ఆడి జనాలను ఎంటర్టైన్ చేయగలిగితే ఫైనల్స్ కు వెళ్లడం ఈజీ అవుతుంది. మరి లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవరో ఏంటో చూడాలంటే వీకెండ్ వరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All