Homeటాప్ స్టోరీస్రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి గల కారణాలు!

రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి గల కారణాలు!

Rahul Sipligunj bigg boss 3 telugu winner
Rahul Sipligunj

బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. అయితే ఇంకా బిగ్ బాస్ గురించి జనాలు మాట్లాడుకోవడం మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 3 కు రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ ఎలా అయ్యాడన్నది చాలా మందికి అంతుచిక్కని ప్రశ్న. ఆడియన్స్ ఓట్లు ద్వారానే గెలిచినా అతను ఇంత దూరం ప్రయాణిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే రాహుల్ కు చాలా నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని రాహుల్ కూడా ఒప్పుకుంటాడు. మరి ఒక విజేతలో ఇన్ని తప్పులా? ఇన్ని తప్పులు చేసిన వాడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడా? అసలు ఎలా అయ్యాడు? శ్రీముఖి చెప్పినట్లు తెర వెనుక ఏమైనా హెల్ప్ రాహుల్ కు అందిందా?? బిగ్ బాస్ లోనే పెద్ద బద్ధకిస్టుగా మారిన రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా తొలి పునాది ఎక్కడ పడింది?? వంటి విషయాలన్నీ తెలుసుకుందాం.

రాహుల్ సిప్లిగంజ్.. మనకు సింగర్ గా సుపరిచితమే, ముఖ్యంగా తెలంగాణలో అందునా హైదరాబాద్ లో రాహుల్ కు మంచి పేరుంది. రంగస్థలం సినిమాలో టైటిల్ సాంగ్, లై సినిమాలో బొంబాట్ వంటి పాటలతో తనలోని టాలెంట్ ఏంటో ఇదివరకే చూపించుకున్నాడు. పైగా మంగమ్మ వంటి ప్రైవేట్ సాంగ్స్ కు చేసాడు. బిగ్ బాస్ లో సింగర్ కోటాలో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. వచ్చిన మొదటి వారమే నటి హేమతో గొడవపడి హైలైట్ అయ్యాడు. తనకు తప్పుగా అనిపిస్తే తగ్గేదే లేదన్న భావన కల్పించాడు. అయితే రాహుల్ కు మొదట్లో చాలా నెగటివిటీ వచ్చింది. బిగ్ బాస్ హౌజ్ లో కచ్చితంగా ఎక్కువ దూరం వెళ్ళడు అన్న భావన కలిగింది. చాలా వీక్స్ లాస్ట్ సేవ్ అయిన కాండిడేట్ రాహుల్ సిప్లిగంజ్. వీటికి కారణాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

* టాస్క్ లు సరిగ్గా ఆడడు. ప్రతిసారి గివప్ అంటూ ఉంటాడు. ఈ విషయం మీద పునర్నవి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ మీద కూడా రాహుల్ స్పీచ్ లో ఈ విషయం గురించి చెప్పాడు. పున్ను టాస్క్ లు ఆడమని అడిగింది, బతిమాలింది, తిట్టింది, కొట్టింది అయినా నేను మారలేదు. కానీ ఒక్కసారి ముఖానికి రంగు పూసి నామినేట్ చేసింది. అప్పుడు నాలో మార్పు మొదలైంది. అని చెప్పాడు.

* రాహుల్ మీదున్న సెకండ్ మేజర్ కంప్లైంట్.. బద్ధకం. సీజన్ మొదట్లో దీని గురించి పెద్ద చర్చే నడిచింది. కనీసం తను తినే ఫుడ్ వేరే వాళ్ళు ప్లేట్ లో పెట్టి ఇవ్వాలి. తను తినే మౌసంబిలు వేరే వాళ్ళు వలిచి ఇవ్వాలి అంటూ చాలా కంప్లైంట్స్ వినిపించాయి. మోస్ట్ లేజియస్ట్ పర్సన్ అంటూ ఒక వారం అవార్డు తీసుకున్నాడు కూడా.

* మూడో మేజర్ కంప్లైంట్.. నోటి మాట. బేసిక్ గా రాహుల్ పెరిగిన పరిస్థితులు కావొచ్చు, ప్రాంతం కావొచ్చు. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం రాహుల్ ది. అంతవరకూ అయితే పర్లేదు కానీ రాహుల్ మాట్లాడిన కొన్ని బూతులకు నాగార్జున పెద్ద క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది.

అయితే మరి రాహుల్ సిప్లిగంజ్ ఎలా విన్ అయ్యాడు? తనలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం. తనకు బిగ్ బాస్ లో ఏమేం అంశాలు హెల్ప్ చేశాయో చూద్దాం.

* బిగ్ బాస్ లో ఆడియన్స్ ముందుగా గమనించేది హానెస్టీ. ఒక కంటెస్టెంట్ ఎంత నిజాయితీగా ఉన్నాడు అన్నది ఆడియన్స్ కు ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఈ విషయంలో రాహుల్ తోప్. అక్కడ ఉన్నది ఎవరైనా నిజాయితీగా తను అనుకున్నది చెప్పడం రాహుల్ స్టైల్.

* ఇక రాహుల్ ఎంత మంచి సింగర్ అనేది బిగ్ బాస్ లో మరో సారి చూసాం. నాగార్జున ఎప్పుడు పాట అడిగినా కాదనకుండా పాడటం, ప్రతిసారీ ఎంటర్టైన్ చేయడం రాహుల్ కు ప్లస్ అయింది. అంతేకాకుండా అప్పటికప్పుడు రాహుల్ ఫన్నీగా కంటెస్టెంట్స్ అందరిమీద రాసిన లిరిక్స్ పెద్ద బూస్టప్ ఇచ్చింది.

* పునర్నవితో రాహుల్ నడిపించిన ఎపిసోడ్, తనకు చాలా మైలేజ్ ఇచ్చింది. ప్రతివారం నాగార్జున దీని గురించి కమెంట్ చేయడం, ఇద్దరినీ కలిపి ఆటపట్టించడంతో రాహుల్ కు మంచి ఫుటేజ్ దొరికింది. తన మీదున్న నెగటివ్స్ ను దూరం చేసింది.

* శ్రీముఖి మాటిమాటికి రాహుల్ ను టార్గెట్ చేయడం కూడా తనకు కలిసొచ్చింది. సానుభూతి ఫ్యాక్టర్ రాహుల్ కు వచ్చింది. ఈ విషయం శ్రీముఖి కూడా గ్రహించి లాస్ట్ లో రాహుల్ తో మళ్ళీ మంచిగా ఉండటం మొదలుపెట్టింది.

* ఇక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్. ఇది కనుక జరగకపోయి ఉంటే రాహుల్ కచ్చితంగా ఫైనల్స్ కు చేరేవాడు కాదు. ఒక్కసారి ఫేక్ ఎలిమినేషన్ అయి మళ్ళీ ఇంట్లోకి వచ్చాక రాహుల్ లో చాలా మార్పు వచ్చింది. అప్పటిదాకా కోల్పోయిన కాన్ఫిడెన్స్ ను తిరిగి తెచ్చుకున్న రాహుల్, అప్పటి నుండి మార్నింగ్ డ్యాన్స్ చేయడం, టాస్క్స్ లో ఎక్కువగా పాల్గోవడం, జనాల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడం వంటివి అతణ్ణి ఆడియన్స్ కు దగ్గర చేసింది.

ముందు నుండీ మంచిగా ఉండేవాడు కన్నా మొదటి చెడ్డగా పేరు తెచ్చుకుని తర్వాత మంచివాడు అనిపించుకున్న వాడి మీదే ఆడియన్స్ కు ఎక్కువ ఇంప్రెషన్ ఉంటుంది. మనుషులన్నాక అందరూ తప్పులు చేస్తారు. కానీ వాటిని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. తన తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లేంత సత్తువ ఉండాలి. వాడికే ప్రపంచం పట్టం కడుతుంది.

రాహుల్ సిప్లిగంజ్ విషయంలో ఇదే జరిగింది. అందుకే అతను బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All